మద్యం దుకాణంలో చోరీ
-90వేలు నగదుతో పరారైన దుండగులు
    తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో అర్ధరాత్రి దొంగలు పడ్డారు.మద్యం దుకాణం పైకప్పును పగుల గొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు 90వేలు నగదు తో పరారయ్యారు.అర్ధరాత్రి 1గం" సమయంలో నలుగురు దుండగులు వచ్చారని,గట్టిగా అరవడంతో తలోదిక్కున పరుగెత్తి పారిపోయారని వాచ్ మేన్ చెపుతున్నాడు.విషయం తెలుసుకున్న పోలీస్ లు,ఎక్సైజ్ అధికారులు,స్పేషల్ బ్రాంచ్ పోలీస్ లు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో దుండగులు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.