*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలోని శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని సమేత అభయలింగేశ్వర స్వామి వారి దేవస్థానం(అడవిలో శివాలయం)లో  మహాశివునికి నిర్వహించిన అభిషేకంలో పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామంలో వెలసివున్న శ్రీ సిద్దేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కాకాణి.*

*స్క్రోలింగ్ పాయింట్స్:*

👉 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజనులందరికీ *"మహాశివరాత్రి"* శుభాకాంక్షలు.

👉 మహాశివుని ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉండాలని, రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించేందుకు శక్తి, సామర్ధ్యాలను పరమేశ్వరుడు అందించాలని భగవంతుని కోరుకున్నా.

👉 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అందుకు పరమశివుని దీవెనలు అందించాలని వేడుకున్నా.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలోని అతి పురాతనమైన శివాలయాలు పునరుద్ధరించడానికి, భక్తుల అభీష్టం మేరకు దేవాలయాలు అభివృద్ధి చేసేందుకు నా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తా.