సమస్యలపై స్పందించండి: మంత్రి మేకపాటి

అనంతసాగరం మండలం అధికారులతో మరియు నాయకులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ నేడు నిర్వహించడం జరిగింది.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో మండల పరిధిలోగల సమస్యలను నాయకులు మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది.

సిమెంట్ రోడ్లు, సైడ్  డ్రెయిన్లు, పీకే పాడు ఇసుక రీచ్,
సోమశిల అనంతసాగరం బస్టాండ్ సెంటర్లో బస్ షెల్టర్లు నిర్మాణం, ఇండ్ల స్థలాలు కాలువల్లో పూడిక తీత,  త్రాగు నీటి తదితర సమస్యలపై చర్చించడం జరిగింది.

వీడియో కాన్ఫరెన్స్లో నాయకులు లేవనెత్తిన సమస్యలపై మండల అధికారులు త్వరితగతిన పరిష్కారం చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డివిజనల్ స్థాయి మండల స్థాయి అధికారులు, అనంతసాగరం మండలం నాయకులు పాల్గొన్నారు.