ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డిని శుక్రవారం అమరావతి వెలగపూడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోట మండలం లోని చెందొడు గ్రామానికి చెందిన గూడూరు నియోజకవర్గ వైసీపీ యువత అధ్యక్షుడు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డిమర్యాద పూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా సజ్జలకు శాలువా కప్పి పుష్ప గుచ్ఛం అందించారు సాయి ప్రసాద్ రెడ్డి,అనంతరం గూడూరు నియోజకవర్గ పరిధిలో వైసీపీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు సజ్జల, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం బాగా శ్రమించాలి అనీ సాయి ప్రసాద్ రెడ్డికి సజ్జల చెప్పారు,యువతను ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని, వైసీపీకి యువతే బలం అని సజ్జల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు ఉన్నారు.