ఉద్యమాల పురిటిగడ్డ విక్రమ సింహపురి నడిబొడ్డున కదంతొక్కిన అమరావతి రైతులు

 

న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర సందర్భంగా నెల్లూరు నడిబొడ్డున మార్మోగిన జై అమరావతి నినాదం


పాదయాత్రకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రైతు నాయకులు,  న్యాయవాదులతో పాటు సామాన్య ప్రజల నుంచి విశేష స్పందన


రాజధాని రైతులకు హారతులు పట్టిన సింహపురి ప్రజానీకం


జోరువానకూ జడవని అన్నదాతలు...బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు


*పాదయాత్రలో పాల్గొని రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించిమ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు సిటీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు 


మాజీ మంత్రి సోమిరెడ్డి కామెంట్స్


మూడు రాజధానుల నిర్ణయం ఆనాలోచితం..రాష్ట్రంలో సాగుతున్న ప్రజాపాలన కాదు, విధ్వంసకర పాలన 


మాట తప్పను..మడమ తిప్పననే ప్రగల్భాలు పలికే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అసెంబ్లీలో అమరావతికి ఎందుకు మద్దతు పలికారు..ఈ రోజు మాట ఎందుకు తప్పారు


సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తుంటే ఎందుకు అడ్డం చెప్పలేదు


అన్ని పార్టీలతో పాటు ప్రజలు రాజధానిగా ఆమోదించిన అమరావతికి ఎందుకు కక్ష కట్టారు


పరిపాలన వికేంద్రీకరణ కాదు..చేతనైతే అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యి


మూడు రాజధానుల నిర్ణయం పిచ్చిపాలనలో భాగమే


అమరావతి ఆడపడుచుల పాదయాత్ర చూస్తుంటే ప్రతి ఒక్కరికీ కంట కన్నీరు వస్తోంది...ఇది చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం


దేవుడి ఆశీస్సులు, ఐదు కోట్ల ఆంధ్రుల మద్దతుతో కచ్చితంగా  అమరావతి రాజధానిగా కొనసాగుతుంది