నెల్లూరులో ఘనంగా పెద్దల పండుగ..  


 సంక్రాంతి ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా ప్రజలు  బోడి గాడి తోటలోని సమాధుల వద్ద తమ పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు నిర్వహించారు చాలా కుటుంబాల్లో కాలంచేసిన కుటుంబీకులను స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది మరణించినవారికి ఇష్టమైన వంటకాలను వారి సమాధులకు సమర్పిస్తారు. ఈ సంవత్సరం కూడా ఇలానే గతించిన కుటుంబ సభ్యులను స్మరించుకునేందుకు బోడిగాడితోటకు జనం భారీగా తరలివచ్చారు.


వైసీపీ నేత రూప్ కుమార్ యాదవ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దల పండుగ వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు