పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డికి  సింహపురి రెడ్డి సంఘం సభ్యులు గౌరవ పూర్వక పలకరింపుఈరోజు  సింహపురి రెడ్డి సంఘం ప్రతినిధులు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డిని కలవడం జరిగింది, పేర్నాటి సతీమణి శ్రీమతి హేమ సుస్మిత  రాష్ట్ర వితనాభివృద్ది సంస్థ ఛైర్మన్ గా పదవీభాద్యతలు స్వీకరించిన సందర్భంగా సింహపురి రెడ్డిసంఘం ప్రతునిధులు నెల్లూరు పట్టణంలో శ్యాం ప్రసాద్ రెడ్డిని ఆయన  నివాసంలో కలిసి అభినందించి శాలువా,పుష్ప గుచ్ఛంతో ఘనంగా సత్కరించారు, ఈ సందర్భంగా తిప్పగంటపాలెం గ్రామానికి సంభందించి సాగునీటి విషయమై ఎల్లంటి సనత్ కుమార్ రెడ్డి, పేర్నాటి దృష్టికి తేగా స్పందించిన పేర్నాటి త్వరలో మంత్రి అనీల్ కుమార్ యాదవ్ గారిని కలిసి ఆయన దృష్టికి తీసుకువెళదామని తెలిపారు, పెర్నాటిని కలిసిన వారిలో సింహపురి రెడ్డి సంఘం అధ్యక్షుడు వి, చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బి.దశరథ రామి రెడ్డి, పిఆర్వో కె. జనార్థన్ రెడ్డి,సెక్రటరీ ప్రజెంద్రారెడ్డి, చిల్లకూరు రెడ్డి సంఘం అధ్యక్షుడు కె,సనత్ కుమార్ రెడ్డి, గౌ అధ్యక్షుడు పి.రఘురామి రెడ్డి, ప్రతినిధులు, ఎం శ్రీనివాసులురెడ్డి, ఏ,భాస్కర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, వై, సనత్ కుమార్ రెడ్డి, సిహెచ్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...