ఆత్మకూరు రూరల్ ఎస్ఐగా  రవి నాయక్

ఆత్మకూరు రూరల్ ఎస్ఐగా ఎం.రవి నాయక్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ రూరల్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న రోజాలతాను నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఎస్ఐ రవినాయక్  మొదట ఉద్యోగ విధులు ఆత్మకూరు ఫైర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా (2008 - 2009) విధులు నిర్వహించారు.తర్వాత సివిల్ సర్వీసుకు ఎన్నిక కాబడి మొదట మర్రిపాడు ఎస్ఐ (2009 - 2011)గా నియమితులు అయ్యారు. ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గా, పోలీస్ డిపార్ట్ మెంట్ ఎస్ఐగా రెండు బాధ్యతలు ఆత్మకూరు సర్కిల్ పరిధిలోనే నాలుగు సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం ప్రత్యేక విశేషం. మర్రిపాడు నుండి బదిలీ అయిన ఎస్ఐ రవినాయక్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ లలో తనదైన ప్రత్యేక శైలిలో విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. పొదలకూరులో ఎస్ఐగా విధులు నిర్వహించే సమయంలో ప్రజలచే మంచి ఎస్ఐ గుర్తింపు ఉంది‌. ప్రస్తుతం చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో  విధులు నిర్వహిస్తు సాధారణ బదిలీలలో భాగంగా ఆత్మకూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా నియమించబడ్డారు. ఆత్మకూరు పట్టణంలో ఫైర్ ఎస్ఐగా పనిచేసిన సమయంలో పట్టణ ప్రజలతో ఇక్కడి అధికారులతో  పరిచయాలు ఉన్న ఎస్ఐ రవి నాయక్ తన విధి నిర్వహణలో పని చేసేందుకు తోడ్పాటు అందనుంది.. ఆత్మకూరు నూతన సీఐగా నియమితులైన సోమయ్య  ప్రస్తుతం రూరల్ ఎస్ఐగా నియమించబడిన రవినాయక్  ఇద్దరూ గతంలో మర్రిపాడు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించడం మరో విశేషం.