`కేజీఎఫ్ ` చాప్టర్ 1ను పాన్ ఇండియా చిత్రంగా కన్నడ తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . దాంతో . `కేజీఎఫ్ ` చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాప్టర్ 1 సాధించిన విజయంతో పెరిగిన అంచనాలకు ధీటుగా దర్శక నిర్మాతలు `కేజీఎఫ్ ` చాప్టర్ 2ను రాజీ లేకుండా నిర్మిస్తున్నారు.కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి అధీరా గా సంజయ్ దత్ లుక్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ సినిమా మరోసారి సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా 'కేజీఎఫ్ 2' నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. రవీనా టాండర్ పుట్టిన రోజు సందర్బంగా ఆమె లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో రవీనా..రమికా సేన్ పాత్రలో నటిస్తోంది. ఈ లుక్ లో ఎర్రటి చీర ధరించి చట్టసభల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.