అర్ధరాత్రి వేళ నిర్మానుష్య ప్రాంతంలో ఆటో కనిపించింది. గొర్రెల కాపరి అక్కడికి వెళ్లడంతో దారుణం వెలుగుచూసింది. యువతి ఒంటిపై బట్టల్లేవు. ఆరుగురు యువకులు నగ్నంగా ఉన్న యువతిని వేధిస్తూ..

 


అర్ధరాత్రి వేళ యువకులు అరాచకం సృష్టించారు. అర్ధరాత్రి ఆరుబయట యువతిని వివస్త్రను చేసి వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఒంటిపై బట్టల్లేకుండా నగ్నంగా ఉన్న యువతిని వేధింపులకు గురిచేశారు. బట్టలు ఇవ్వకుండా కీచకపర్వానికి దిగారు. ఈ అత్యంత అమానుష ఘటన ఏపీలోని నెల్లూరు నగరంలో వెలుగుచూసింది. వెంకటేశ్వరపురం ఏరియా జనార్దన్‌రెడ్డి కాలనీ మసీదు వెనక గొర్రెల మండీ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. మండీ వెనక జనసంచారం లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది.అర్ధరాత్రి వేళ ఆటోలో వచ్చిన యువకులు యువతి బట్టలిప్పేసి అమానుషంగా ప్రవర్తించారు. ఒంటిపై బట్టల్లేకుండా నగ్నంగా ఉన్న యువతికి బట్టలివ్వకుండా వేధింపులకు గురిచేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన గొర్రెలకాపరి ఆటోని చూసి దగ్గరికెళ్లడంతో దారుణం వెలుగుచూసింది. ఆరుగురు యువకులు వివస్ర్తగా ఉన్న యువతిని వేధిస్తూ కనిపించారు. ఆమెకు దుస్తులు ఇవ్వకుండా వికృత చేష్టలకు పాల్పడ్డారు.
గొర్రెలకాపరి టార్చ్‌లైట్ వేయడంతో దుర్మార్గులు అక్కడి నుంచి పరారయ్యారు. దగ్గరికి వెళ్లిన కాపరి యువతిని గుర్తించి సామయమందించాడు. ఒంటిపై బట్టల్లేకుండా ఉన్న అభాగ్యురాలికి దుస్తులు అందించడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.