శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు నందు ఈరోజు అనగా తేది. 24.03.2021 బుధవారం ఉదయం 6.15గంIIలకు ధ్వజారోహణ కార్యక్రమము జరిగినది. ఉభయకర్తలు ‘’పద్మశాలి బహుత్తమ సంఘం తరపున శ్రీ కోలాటి శ్రీనివాసులు తదితరులు’’. శ్రీ స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణ చేసి మంగళవాయిద్యాల మధ్య ద్వజస్తంభాన్ని దర్భతో చేసిన పవిత్ర దర్భాన్ని, వస్త్రాన్ని ధ్వజస్తంభానికి అలంకరించి ప్రత్యేక పూజలు చేసారు. దూపదీప నైవేద్యాన్ని  సమర్పించి ధ్వజారోహణ నిర్వహించారు. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లను ఉత్సవంను పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమమునకు ఆలయ ఈఓ డబ్బుగుంట వెంకటేశ్వర్లు, దేవస్థాన ఫెస్టివల్ కమిటి శ్రీ శ్రీరామ్ వెంకట సురేష్, శ్రీ టి.వి.నరసింహాచార్యులు, శ్రీ చందులూరు రమేష్, శ్రీమతి పాలకీర్తి అమ్ముణ్ణి, శ్రీమతి మిరియాల శివ కామి, శ్రీ టి.శేషయ్య మరియు దేవస్థాన సిబ్బంది మరియు అర్చకులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధ ప్రసాదము స్వీకరించినారు.