రామమందిరం కోసం తయారు చేసిన 613 కేజీల గంట అయోధ్యకు చేరింది. తమిళనాడు రామేశ్వరం నుంచి 4500 కీమీ ప్రయాణించి ట్రస్టు సభ్యులకు అందజేశారు రాజ్యలక్ష్మి. "బుల్లెట్ క్వీన్‌"గా పేరొందిన రాజ్యలక్ష్మి..ఈ గంటను తయారు చేశారు. ఏ గంటనైనా కొడితే టంగ్‌, టంగ్‌ అని మోగుతుంది. కానీ ఈ గంటను కొడితే "ఓం" అని పలుకుతుందట. దీంతో భక్తులు ఎంతో ఆస్తకిగా దాన్ని మోగిస్తూ...భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. ఈ శబ్దం కొన్ని కీలో మీటర్లు వరకు వినిపిస్తుందట. 4.13 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పుతో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, వినాయకుడి ప్రతిమలను ఏర్పాటు చేశారు. జై శ్రీరాం అనే అక్షరాలు రాసి ఉంచారు. ప్రధాని మోడీ పుట్టిన రోజు సెప్టెంబర్‌ 17న ప్రత్యేక వాహనంలో బయలుదేరిన ఈ గంట బుధవారం అయోధ్యకు చేరుకుంది. రామాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ భారీ గంటను అమర్చనున్నారు.