భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మనుబోలు, తోటపల్లి గూడూరు మండలం పేడూరులో సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దాయన అంబేద్కర్ ఎక్కడున్నారో కానీ ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి బాధపడుతుంటారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా పాలన సాగుతుండటం బాధాకరమన్నారు. పౌరులకు ఆయనిచ్చిన హక్కులను హరించేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని బడుగుబలహీన వర్గాల వారికి అండగా నిలుస్తుందని, ప్రతి ఓటరూ అంబేద్కర్ రాజ్యాంగం మనకు ఇచ్చిన ఓటు హక్కును స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకుని పనిచేసే పనబాక లక్ష్మి ని ఆశీర్వదించాలని ఆయన అన్నారు.