నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 37వ డివిజన్, కొండాయపాలెం గేట్ లోని సాంఘీక సంక్షేమ బాలుర హాస్టల్ లో ఎమ్.పి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నిధులతో 5 లక్షల రూపాయలతో ఆర్.ఓ. ప్లాంట్ ను ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 

కాలుష్యం రోజురోజుకు అధికమవుతుంది, రకరకాల వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులతో పరిశుద్ధమైన మంచినీరు త్రాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

 హాస్టల్ లో కానీ, స్కూళ్ళల్లోకానీ కలుషితనీరు త్రాగి అనారోగ్యంపాలుకాకుండా ఉండటానికి ఈ ఆర్.ఓ. ప్లాంట్లు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

 భవిష్యత్తులో కొండాయపాలెం గేటు లోని సంక్షేమ బాలుర హాస్టల్ కు సంబంధించి ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజులలో చేసితీరుతాం.  రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్  రెడ్డి.