పలు రంగాలకు చెందిన 10 మంది ప్రముఖులకు హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు అందజేశారు.ప్లవనామ ఉగాదిని పురస్కరించుకుని నెల్లూరు నగరం టౌన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో అమీనా రాజు రమణ ఉమా భాగ్యశ్రీ రాజశేఖర్ లక్ష్మీ మైధిలి జ్యోతి శేషయ్య సుధాకర్ రెడ్డి మస్తానయ్యల కు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, హరివిల్లు క్రియేషన్స్ వ్యవస్థాపకులు దోర్నాల హరిబాబు, భయ్యా వాసు, శ్రీనివాసులు, బలరామయ్య నాయుడు, వేలూరు రంగారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.