మద్యం విక్రయాలపై కర్ణాటక సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మే 9వతేదీ నుంచి 17వతేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని రెస్టారెంట్లు, పబ్‌లు, బార్‌లలో కూడా రిటైల్ ధరలకు మద్యం విక్రయాలకు అనుమతిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రెస్టారెంట్లు, పబ్‌లు, బార్‌లలో మందుబాబులు ఇంటికి తీసుకువెళ్లేలా అమ్మకాలు చేసుకోవచ్చని సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతంలో ఆదాయం కోసం మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించింది. ఇప్పుడు మద్యం విక్రయాల ద్వార మరింత ఆదాయం పెంచుకునేందుకు మద్యాన్ని రెస్టారెంట్లు, పబ్‌లు, బార్‌లలో కూడా రిటైల్ ధరలకు విక్రయించవచ్చని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలో కరోనా కేసుల
సంఖ్య 753కు చేరింది.