మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 104 వాహనాన్ని మండల వైసీపీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగతమాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పేద బడుగు బలహీన వర్గాల వారికి యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 104 108 వాహనాలను ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి వి కిషోర్ మాట్లాడుతూ గతంలో నియోజకవర్గానికి 104 వాహనం ఉండేదని పేదల అవసరాల దృష్ట్యా ప్రస్తుతం ప్రతి మండలానికి 104 వాహనం ఏర్పాటు చేశారన్నారు. వివాహంలో అత్యాధునిక పరికరాలు అయినా ఆక్సిజన్ సిలిండర్ ఈసీజీ రక్త పరీక్షలు సంబంధించి పరికరాలను అమర్చారు అని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్యామిలీ డాక్టర్ అనే నినాదంతో ముందుకు తీసుకు రావడం జరిగిందన్నారు. ఇక నుండి పేదలు దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోకుండా ప్రతినెల వారి గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడామందులు పంపిణీ చేస్తామన్నారు. మండలంలో 60 గ్రామాల్లో వైద్య సౌకర్యం అందేలా వైద్య సిబ్బంది తో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సిద్ధం రెడ్డి మోహన్ రెడ్డి అబ్దుల్లా వైద్యాధికారులు మరియు వైద్య సిబ్బంది 104వాహనం పైలెట్ ఎస్కె ఫిరోజ్ పాల్గొన్నారు.