కావలి  పట్టణం ముసునూరు నందు ఎన్టీఆర్ విగ్రహం తొలిగించిన తీరు నన్ను కలిచివేసిందని ఏదైనా అభ్యంతరాలు ఉంటే విగ్రహం నిర్మించేటప్పుడే అభిప్రాయాలను వ్యక్తం చేయాలేకాని ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచి పద్దతి కాదని మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన జర్నలిస్ట్ క్లబ్ కు విచ్చేసి కాసేపు విలేకరులతో ముచ్చటించారు. అనంతరం మెదటిసారిగా జర్నలిస్ట్ క్లబ్ కు విచ్చేసిన వంటేరును,ఆయన కుమారుడు వంశీకృష్ణను జర్నలిస్ట్ క్లబ్ జర్నలిస్టులు దుస్శాలువతో సన్మానించారు. అనంతరం వంటేరు మాట్లాడుతూ కావలిలో సీనియర్ పాత్రికేయులు అందరూ కలసి జర్నలిస్ట్ క్లబ్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యల పట్ల పోరాటం చేస్తూ అక్రమాలను బయటకు తీస్తూ పోరాటం చేస్తున్న జర్నలిస్టులను అభినందించారు. అలానే జర్నలిస్టులకు భావ స్వేచ్చ ఉంటుందని మనకు నచ్చని వార్తాలు వ్రాస్తే దాడులు చేయటం మంచి పద్ధతి కాదన్నారు. నేను మెదటి నుంచి ఎన్టీఆర్ కు అభిమానినని ఆయన సినిమాలు రిలీజ్ అయితే సైకిల్ మీద కావలికి వచ్చి చూసి వెళ్లేవాడినని తెలిపారు. ఆయన విగ్రహాన్ని తొలిగించిన తీరు మనస్సు చువుక్కు మన్నదన్నారు. ఆనాడు పార్టీలకు అతీతంగా కలికి యానాదిరెడ్డి విగ్రహానికి మెయిన్ సెంటర్ లో ప్రతిష్టించేందుకు నావంతు సహకరించానన్నారు .అలానే కరోనా మహమ్మారితో కావలిలో ఎక్కువ మంది చనిపోటం బాధ వేసిందన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ వచ్చేంతవరకు  ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. అలానే  ఈ మద్య కాలంలో నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించాల్సిన అవసరం లేదన్నారు . రాజికీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరన్నారు. కాని అప్పటి రాజికీయాలు వేరు ఇప్పటి రాజికీయాలు వేరుగా ఉన్నాయన్నారు.