నెల్లూరు జిల్లాలో
గుట్టుగా కొనసాగుతున్న వ్యభిచారం గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా హోంగార్డు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. మండల కేంద్రమైన కోవూరు పట్టణంలోని ప్రమీలానగర్‌ సూపర్‌మార్కెట్‌ వెనుక ఉన్న ఇంట్లో ఓ జంట భార్యభర్తలమని చెప్పి అద్దెకు దిగారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.దీనిపై కచ్చితమైన సమాచారం అందుకున్న నెల్లూరు గ్రామీణ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి తనిఖీ చేయాల్సిందిగా కోవూరు పోలీసులను ఆదేశించారు. దీంతో కోవూరు సీఐ రామారావు ఆధ్వర్యంలో ఎస్సై చింతం కృష్ణారెడ్డి తన సిబ్బందితో కలిసి శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో విజయవాడకు చెందిన యువతితో పాటు విటుడు సురేష్‌, నెల్లూరుకు చెందిన హోంగార్డు షఫనితో పాటు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న నెల్లూరుకు చెందిన సాగర్‌ అలియాస్‌ రమణ, నాగశైలజను అరెస్ట్ చేశారు.
ఈ జంట గతంలో నెల్లూరులో వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డారని, బెయిల్‌పై బయటకు వచ్చి కోవూరుకు మకాం మార్చుశారని పోలీసులు తెలిపారు. అయితే వ్యభిచారం చేస్తూ పట్టుబడిన హోంగార్డును తప్పించాలని కొందరు రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కోవూరు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం