నాయుడుపేట జాతర మే 5న

నెల్లూరు జిల్లా నాయుడుపేట గ్రామదేవత పోలేరమ్మ జాతర మే నెల 5 వతేదీన నిర్వహించనున్నామని ఆలయ EO వరప్రసాద్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా విన్నమాల పెద్దకాపు అరవభూమి శ్రీనివాసులు రెడ్డి ఇంటి వద్ద సాంప్రదాయబద్దంగా ఆలయ నిర్మాణ ధర్మకర్త వారసులు నల్లబోతుల రామారావు   ఈరోజు తాంబులాలు మార్చుకున్నారు. మంగళవారం రాత్రి మొదటిచాటింపు అనంతరం మే 4,5 తేదీలలో జాతర నిర్వహించనున్నారు.ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆకుల కుబేరు మణి,దొంతల రాజశేఖరరెడ్డి , గుంటూరు లక్ష్మయ్య,నల్లబోతుల అంజయ్య,విన్నమాల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.