రైతుల చేతులకు వేసిన సంకెళ్ళు తో జగన్ ప్రభుత్వ పతనం ఆరంభం.
అమరావతి రాజధాని కోసం ఉద్యమిస్తే SC ST అట్రాసిటీ కేసులు పెట్టడం హక్కులను హరించడమే..
ప్రజల హక్కులను కాలరాస్తే తిరుగుబాటు తప్పదు
******************************************

రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరూ 315 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం   కనీసం ఏమి జరుగుతుంది అని ఒక మంత్రి స్థాయిలో విచారణ కూడా చేయలేని ప్రబుత్వం రైతులపై అక్రమంగా గా సెక్షన్ 3  కేసులు పెట్టడాన్ని నిరసిస్తూన్నాం

ఈదేశంలో  బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు అందించిన రాజ్యాంగం ప్రకారం ఉన్న మానవ హక్కులు ను కాలరాస్తు,సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను సైతం లెక్క చేయకుండా రైతులను తీవ్రవాదులు గా దేశ ద్రోహులు గా చూస్తూ చేతులకి సంకెళ్ళు వేసి జైలుకు తీసుకుపోవడం వాయత్తు రైతాంగానికి జరిగిన అవమానం గా చూడాలి రైతు బిడ్డ అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఇదేనా రైతులకు ఇచ్చే గౌరవం అని ప్రశ్నిస్తున్నాం.

అమరావతి రాజధాని గా కొనదాగుతుంది చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తాము ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటే ప్రజలు నమ్మి మీకు అవకాశం ఇచ్చిన రైతులను ఇలా రోడ్ల మీద అవమానపరచడం దుర్మార్గపు ఆలోచన.

315 రోజుల JAC దీక్షలను తక్కువ చేసి చూస్తే,రైతు కంట కన్నీరు నీకు పన్నీరు లా కనిపిస్తే,రైతుల ఆక్రందనలు నీకు వినిపించక పోతే...ఇక నీకు నీ ప్రభుత్వం కి రోజులు దగ్గర పడినట్లే అని గుర్తుపెట్టుకోవాలి.

రాష్ట్ర ప్రజల అవసరం కోసం ప్రపంచస్థాయి రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేసిన SC,ST,BC,OC,మైనార్టీ వర్గాల బహుజన రైతుల మీద అక్రమ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైళ్ళకి పంపి అవమాన పరచడం చూస్తుంటే జగన్ రైతు ద్రోహిగా చరిత్రలో నిలబడి పోతారు అని చెప్పవచ్చు.

జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు అంతం అమరావతి ఉద్యమంతో ప్రారంభం అయ్యింది అని తెలుపుతూ

రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకొని, వెంటనే విడుదల చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నాం..!!

 రాజధాని రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.. అమరావతే ఆంద్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది అని తెలియజేస్తున్నాం.

పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
మాజీ శాసనసభ్యులు
కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్.