మర్రిపాడు లో ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంమర్రిపాడు మండల విద్యా వనరుల కేంద్రం నందు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి  సుస్మితారెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తున్నదని,దివ్యాంగుల లో అంతర్లీనంగా ఎన్నో సామర్ధ్యాలు ఉంటాయని,వాటిని వెలికి తీసుకురావడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డీ.సీ.పల్లి కి చెందిన  అమ్మ నాన్న ఫౌండేషన్ నిర్వాహకులు మధుసూదన శాస్త్రి సహకారంతో దివ్యాంగులకు బహుమతులు పంపిణీ చేశారు.నెల్లూరుకు చెందిన ముక్తియార్ మరియు వారి కుటుంబ సభ్యుల దాతృత్వంతో భోజన వసతి ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మర్రిపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివజ్యోతి,ఎం.ఆర్.జీ. రాజేంద్ర కుమార్, మర్రిపాడు మెయిన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బరాయుడు,సహిత విద్య ఉపాధ్యాయురాలు అనిత,సి.ఆర్.పీ లు, ఆఫీసు సిబ్బంది,మండలంలోని దివ్యాంగ విద్యార్థులు,వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు