నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, టి.పి.గూడూరు మండల రెవిన్యూ కార్యాలయంలో "నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు" పథకంపై అధికారులతో సమీక్షించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి


టి.పి.గూడూరు మండలంలో పేదలందరికీ ఇళ్లు పధకం కింద 3435 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. అర్హత కలిగిన కుటుంబాలు అదనంగా దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వెంటనే అర్హుల జాబితాలో చేర్చండి. ఇళ్ల స్థలాల గుర్తింపు విషయంలో గ్రామాలలో ఎదురయ్యే సమస్యలను అధికారులు సామరస్యంగా పరిష్కరించండి. గ్రామాలలో విచారణ చేపట్టి అర్హులను గుర్తించి, అనర్హులను జాబితా నుండి తొలగించండి. రాజకీయాలకు, పార్టీలకు ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు అందిస్తాము. సాంకేతిక లోపాలు తలెత్తితే సవరించి, అర్హులకు న్యాయం చేయాలి. గతంలో పేదలకు పంపిణీ చేసిన పట్టాలకు సంబంధించి స్థలాలు ఎక్కడున్నాయో తెలియక లబ్ధిదారులు పట్టాలు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలను గుర్తించి, లేఅవుట్లను అభివృద్ధి చేసి, ఇళ్ల పట్టాలను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు అడ్డుకునేందుకు రకరకాల కారణాలతో కోర్టులకు వెళ్లుతున్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను అడ్డుకోవాలని చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు ప్రయత్నించడం దుర్మార్గం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగస్టు 15వ తేది నాడు పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలను సేకరించి ప్రజలకు అందించేందుకు వేలాది కోట్లు వెచ్చిస్తుంటే దానిపై విమర్శలు చేయడం దుర్మార్గం.  సర్వేపల్లి నియోజకవర్గంలో  ప్రభుత్వ భూమితో పాటు అవసరం మేరకు ప్రైవేటు వ్యక్తుల నుండి  భూములను కొనుగోలు చేసి, ఇళ్లస్థలాలుగా అందజేస్తున్నాం. పేదలు అనుభవిస్తున్న భూమిని విడిచిపెట్టి, భూస్వాముల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను సేకరించి పేదవారికి ఇళ్లస్థలాలుగా అందిస్తున్నాము. పేదలందరికీ ఇళ్ల పట్టాల విషయంలో సమర్థవంతంగా పని చేసిన అధికారులకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.