అభివృద్ధి పనులుకు నిధులు మంజూరు చేయండి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరిన MLA కిలివేటి

✍ సూళూరుపేట నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులుకు నిధులు మంజూరు చేయాలని తిరుపతి మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని MLA కిలివేటి సంజీవయ్య కలసి విన్నవించారు..

🙏నాయుడుపేట మండలంలో   కారుమంచివారికండ్రిగ.. మందబైలు పంచాయితీగా...అలాగే  విన్నమాల పరుదిలోని గ్రామాలు పంచాయతీగా నూతనంగా ఏర్పడ్డాయని తెలిపారు..

🙋‍♀️ ఈ పంచాయితీలలో సిమెంట్ రోడ్లు..డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు..

🙋‍♂అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా వాటికి నిధులు మంజూరు చేయాలని కోరారు..

🙏ఇసుక పాలసీలో సరికొత్తగా తీసుకున్న నిర్ణయంతో పేదలకు వెసులుబాటు లభించిందని... సచివాలయాల ద్వారా అందించాల్సిన సేవలకు మార్గదర్సకాలను జారీ చేయాలని కోరారు..

🤝 MLA కిలివేటి సంజీవయ్య వినతులపై మంత్రి పెద్దిరెడ్డి సానుకూలంగా స్పందించి అభివృద్ధికి అవసరమైన నిధులు అందిస్తామని తెలియజేసారు.