పతంజలికి కేంద్రం షాక్.. కరోనా మందుకు బ్రేక్

ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి కరోనాకి మందుని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం మందికి నెగిటివ్‌ రావడం శుభసూచకం. అలాగే 7 రోజుల్లో వంద శాతం మంది కోలుకున్నారు. మందును తీసుకురావడంలో మా శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయం అన్నారు. అయితే మందుని విడుదల చేసిన కొద్దిగంటల్లోనే రామ్ దేవ్ బాబాకు కేంద్రం షాక్ ఇచ్చింది. కరోనా ఔషధానికి సంబంధించిన పూర్తి పరిశోధనా వివరాలు అందజేయాలని.. అప్పటి వరకు ప్రకటనలను నిలిపివేయాలని ఆయుష్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పతంజలి మందు కరోనిల్‌ తయారీలో వాడిన ఔషధాలు ఏంటి? ఎంత మోతాదులో ఉన్నాయి? ఏ ఆస్పత్రుల్లో ఔషద ప్రయోగాలు చేశారు? సంబంధిత పరిశోధనల ఫలితాల వివరాలు, ఇనిస్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ క్లియరెన్స్, సీటీఆర్ఐ రిజిస్ట్రేషన్ వివరాలను తమకు అందించాలని స్పష్టం చేసింది.