ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేసిన పాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైనంపాటి ఏసురత్నం   సోమవారం సాయంత్రం స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర పాస్టర్స్ అసోయేషన్ అధ్యక్షుడు మైనంపాటి ఏసురత్నం మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇలాంటి సమయంలో మమ్మల్ని గమనించి ప్రతి అర్చకులకు పాస్టర్లకు ఇమాంలకు   5000/- రూపాయలు ఇచ్చి   ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి  గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ విలేకరుల సమావేశంలో పాస్టర్స్ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఏసురత్నం  సీనియర్ పాస్టర్ ప్రసాద్ గారు పురుషోత్తం  అళహరి వంశీ రెవ. సంజీవయ్య  ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు