పొదలకూరులో మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్...


పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను బెదిరించినట్లు పార్లమెంటు ఉప ఎన్నికలో బెదిరించలేరు..


కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో జరుగుతున్న ఎన్నికలివి...


టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, ప్రస్తుత వైసీపీ పాలనలో పడుతున్న అగచాట్లను ప్రజలు బేరీజు వేసుకుని పనబాక లక్ష్మిని ఎంపీగా గెలిపిస్తారనే నమ్మకం మాకుంది..


గోవర్ధన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంలో కీలకంగా నిలవడంతో పాటు వారి కుటుంబానికి రాజకీయ బిక్ష పెట్టిన మండలం పొదలకూరు..


ఎవరికీ పట్టని కండలేరు ఎడమకాలువ లిఫ్ట్ ను రూ.62 కోట్లతో చేయించి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయడంతో పాటు ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించాం..


చేజర్ల మండలం గాలిపాళెం నుంచి పొదలకూరు మండలంలోని పలు గ్రామాల చెరువులను నింపుకుంటూ వెంకటాచలం మండలం పాలిచెర్లపాడు వరకు కండలేరు జలాలు తీసుకొచ్చాం..


ఈ లిఫ్ట్ ద్వారా 18 చెరువులకు నీళ్లు అందడంతో పాటు పంపింగ్ ద్వారా రైతుల నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు..


మా హయాంలో 25 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తే 2 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేసుకోవడం దురదృష్టకరం..


మీరు అంగీకరించినా, అంగీకరించకపోయినా కండలేరు ఎడమకాలువ లిఫ్ట్ పంటలు, నిమ్మతోటలను ఎలా కాపాడిందో రైతులకు తెలుసు..


రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పొదలకూరుకు చేసింది ఏమీ లేకపోగా ఇప్పుడు కమీషన్ కోసం కాలువకు లైనింగ్ చేస్తామంటున్నారు..


కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినప్పుడు కండలేరు లిఫ్ట్ సంగతి గుర్తుకురాలేదా..


దక్షిణ కాలువ పెండింగ్ పనులు ప్రారంభించడంతో పాటు సోమశిల జలాలు పొదలకూరు మండలానికి మేం తీసుకొస్తే..మీరొచ్చి పనులను ఆపేశారు..


పొదలకూరు మండల ప్రజల దాహార్తిని తీర్చేందుకు మెగా వాటర్ ప్లాంట్ తెస్తే దానిని మూలనపెట్టేశారు..


మీకు చేతనైతే మిగిలిన 5 శాతం పనులు పూర్తి చేసి ప్రజలకు మినరల్ వాటర్ అందించండి..


ప్రజలకు మంచి జరగడమే మీకు ఇష్టం లేనట్టుంది..పార్లమెంటు ఉప ఎన్నిక వచ్చిందని సిమెంట్ రోడ్లు వేసుకుంటూ సవిటి కాలువలు కట్టుకుంటున్నారు..


నాణ్యత లేకుండా సాగుతున్న ఆ పనులపైనా అధికారుల పర్యవేక్షణ ఉందా...ఆర్నెళ్లు అయిన ఆ పనులు నిలబడతాయా..


కమీషన్లకు కక్కుర్తిపడి ఇంజనీర్లను పనుల పర్యవేక్షణకు వెళ్లకుండా ఆపడం అన్యాయం..


నువ్వూ శాశ్వతం కాదు...నేనూ శాశ్వతం కాదు...గ్రామాల్లో జరిగే పనులు శాశ్వతమని గుర్తుంచుకోండి..


దశాబ్దాలుగా మీ పాలనలో కనీసం రోడ్లకు నోచుకోని అనేక గ్రామాలకు మేం వచ్చి రహదారులు నిర్మించాం..


పార్లపల్లి, నల్లబాళెం, యర్రబాళెం, దుగ్గుంట, రామాపురం, చిట్టేపల్లి, బత్తులపల్లి, కొనగలూరు....ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గ్రామాలకు రోడ్లు నిర్మించాం...


ఏఐఐబీ నిధులు రూ.22 కోట్లు,  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మేం తెచ్చిన ప్యాకేజీ...మీరు తెచ్చింది కాదని గుర్తుంచుకోండి..


చెరువుల అభివృద్ధికి ఏడీబీ నిధులు తెచ్చింది కూడా మేమే...చెక్ డ్యాంలు కట్టింది కూడా మేమే...నిమ్మ యార్డులో సిమెంట్ రోడ్లు వేయించాం...వ్యాపారులకు కొట్లు కట్టించాం...ఇలా శాశ్వతమైన పనులు ఎన్నో చేయించాం..


ఆ ప్రభుత్వంలో డబ్బులివ్వలేదు...ఇప్పుడు మేం ఇస్తున్నాం అంటున్నారు..అవి తోడేరు నుంచి తెచ్చిస్తున్న డబ్బులు కాదు..


నిధులు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ ద్వారా అప్పగించిన పనికి ప్రభుత్వమే బిల్లులు చేస్తుంది...అది ఏ ప్రభుత్వమైనా చెల్లించాల్సిందే..


మాతో పోటీపడి పనులు చేయించు..అంతే కానీ మేం చేసిన పనుల గురించి వ్యంగ్యంగా మాట్లాడుకుంటూపోతే ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు..