ప్రతి జిల్లాలో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కుల అభివృద్ధి : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


పరిశ్రమల శాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్షపోర్టులు,రాబోయే ప్రాజెక్టులకు ఏపీఐఐసీ భూముల కేటాయింపులు, 'ఒక జిల్లా-ఒక వస్తువు'పై చర్చ
అమరావతి, డిసెంబర్, 17;  రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. పరిశ్రమల శాఖపై విజయవాడలోని ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.  ఏపీఐఐసీ భూ కేటాయింపులు, ఒక జిల్లా-ఒక వస్తువు, పోర్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి, రాబోయే ప్రాజెక్టులకు ఏపీఐఐసీ ద్వారా కేటాయించవలసిన భూములకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా మంత్రి మేకపాటి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండీ రవీన్ రెడ్డి, ఈడీ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.