కోవూరు మండలం లోని పోతిరెడ్డి పాలెం తిప్ప గిరిజన కాలనీ లో జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి శనివారం సాయంత్రం పర్యటించారు ఈ సందర్భంగా అక్కడ జగనన్న కాలనీ లకు సంబంధించిన లేఅవుట్ ను పరిశీలించారు. లేఔట్లకు సంబంధించి మౌలిక వసతులను పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు