కోవూరు మండలంలోని పడుగు పాడు గ్రామ సచియాలయాన్ని తనిఖీ చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి ...ఈ సందర్భంగా గ్రామ సచివాలయంలో కార్యాలయం ఆవరణలో వర్షపు నీరు నిలిచి ఉండడంతో  కార్యదర్శి కృష్ణమూర్తిని ప్రశ్నించారు... అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయం రికార్డులను ఆమె తనిఖీ చేశారు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించారు ..ఈ సందర్భంగా సచివాలయం సిబ్బందికి సూచనలు జారీ చేశారు... ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలనిఈ సందర్భంగా డిపిఓ ఆదేశించారు