*కాకాణీ...ఉత్తుత్తి శీలపరీక్షలు కాదు..కంటేపల్లి అటవీ భూముల్లో గ్రావెల్ దొంగలిస్తూ ఒకటికి రెండు సార్లు దొరికిపోయిన నీ బినామీలపై చర్యలు తీసుకుని నీ నిజాయతీ నిరూపించుకో...*

*నిన్న ఉదయం నీ బినామీలైన రైల్వే కాంట్రాక్టర్లను టీడీపీ నాయకులని నోటికొచ్చిన అబద్ధాలు చెప్పావు..వాళ్లు నీ అనుచరులని నిరూపించడంతో శీలపరీక్ష అంటూ కొత్త డ్రామాకు తెరలేపావ్..*

*కంటేపల్లి అటవీభూముల్లో తవ్వకాలకు ఉన్న అనుమతులను చూపించగలవా...*

*దొంగ డ్రామాలు ఆపి నిన్న కంటేపల్లి నుంచి మీరు తప్పించేసిన మిగిలిన టిప్పర్లు, ప్రొక్లెయిన్లను పోలీసులకు అప్పగించి చర్యలు తీసుకోండి..*

*సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి హితవు పలికిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ యాదవ్*

*నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మంగళవారం వెంకటాచలం మండల టీడీపీ అధ్యక్షుడు గుమ్మడి రాజయాదవ్, ప్రధాన కార్యదర్శి వల్లూరు రమేష్ నాయుడు, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సత్తార్ సాహెబ్ తో కలిసి మీడియాతో మాట్లాడిన సంపత్ యాదవ్.....*

నిన్న కంటేపల్లి అటవీభూముల్లో గ్రావెల్ కొల్లగొడుతూ అడ్డంగా దొరికిపోయిన తర్వాత సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి భుజాలు తడుముకుంటూ మీడియాలో కొన్ని కామెంట్లు పెట్టారు..

గ్రావెల్ తరలిస్తున్న పద్మనాభ నాయుడు  టీడీపీ నాయకుడే అని మొదట అన్నారు..వైఎస్సార్ సీపీతో సంబంధాలు నిరూపించమని సవాల్ విసిరారు..

కాకాణి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలన్నీ, పద్మనాభ నాయుడికి ఆయన ఇంటికెళ్లి వైసీపీ కండువా కప్పిన విషయాన్ని మా ఆనం వెంకటరమణా రెడ్డి ఆధారాలతో సహా నిరూపించారు..

ఆ డ్రామా ఫెయిల్ కావడంతో సాయంత్రానికి శీలపరీక్ష అంటూ మరొ కొత్త డ్రామాకు తెరదీశారు..

నిన్న కాకాణి చేసిన ఆరోపణలకు, ఈ రోజు చేసుకున్న శీలపరీక్షకు ఏమైనా సంబంధం ఉందా...

కంటేపల్లి అటవీ భూముల్లొ గ్రావెల్ కొల్లగొడుతూ ఒకటికి రెండు సార్లు దొరికిపోయిన కాంట్రాక్టర్ పద్మనాభ నాయుడు నీ మనిషని మేం నిరూపించాక చెప్పిన మాట ప్రకారం రాజీనామా చేస్తావనుకున్నాం..

కాంట్రాక్టర్లు టీడీపీ నాయకులని నమ్మించే కుట్ర భగ్నం కావడంతో ఈ రోజు రైతులు టీడీపీ సానుభూతిపరులంటున్నావ్..

అసలు అటవీ భూముల్లో నీ మనుషులు గ్రావెల్ తవ్వడానికి ఉన్న అనుమతులు మీడియాకు చూపించావా..చూపించగలవా..

నువ్వు పెద్దమనిషివైతే అక్రమ గ్రావెల్ తవ్వకాలు ఆపాలి, తవ్విన రైల్వే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి..అంతే కానీ ఎవరో ఒకరికి బురద పూయాలనే ప్రయత్నం చేయడం దుర్మార్గం..

సర్వేపల్లి నియోజకవర్గంలో రేయింబవళ్లు గ్రావెల్ అక్రమ మైనింగ్ చేస్తున్న వాళ్లందరూ మీ వైసీపీ నాయకులే..

నీ అనుమతి లేకుండా సర్వేపల్లి నియోజకవర్గంలో గుండు సూది కూడా కదిలే పరిస్థితి లేదు..

నువ్వు మట్టి తింటున్నావనే విషయంలో అనుమానమే లేదు...

మీకు చేతనైతే నిన్న కంటేపల్లి నుంచి మీరు తప్పించేసిన టిప్పర్లు, ప్రొక్లెయిన్లను పోలీసులకు అప్పగించండి..గ్రావెల్ తరలించిన వారిపై చర్యలు తీసుకోండి..

నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా, అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూసినా తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది..మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకునే వరకు ఊరుకోబోము...