మన కమ్మర కులం అనేక సమస్యల వలయంలో చుట్టుకొని విలవిల లాడుతున్న ఈ సమయంలో మన సమస్యలకు శాశ్విత పరిష్కారం రావడానికి మొట్టమొదటి అడుగు కోటప్పకొండ మన కమ్మర అన్నదాన సత్రం నుండి వేశారు ఆంధ్రప్రదేశ్ కమ్మర తెగ సంక్షేమ సంఘం చైర్మన్ శ్రీ.ఓరుగంటి. సుబ్బారావు గారు....ఆంధ్రప్రదేశ్ st కమీషన్ చైర్మన్ అయిన కుంభ .రవి బాబు గారితో మాట్లాడి  అతనిని మన అన్నదాన సత్రానికి ఆహ్వానించి తన చేత పూజ కార్యక్రమం చేయించి మన కమ్మర సత్రానికి మరియు మనకు కావలసిన కార్పొరేషన్ లోన్ల విషయంలో నా వంతు సహాయం నేను చేస్తాను అని  తన చేత స్వయంగా చెప్పించాడు.ఇది కదా మన ఛైర్మన్ ఓరుగంటి సుబ్బారావు గారికి st కమిషన్ చైర్మన్ గారితో ఉన్న సాన్నిహిత్యానికి నిదర్శనం.... అంతేకాదు ఇక్కడ కమ్మర సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ అయిన అంబలికర్ర వెంకట స్వామి గారి కృషిని కూడా ప్రశంసించవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది....ఛైర్మన్ గారి సూచనల ప్రకారం ఈ రోజు st ఛైరన్ గారికి మర్యాద పూర్వక ఏర్పాట్లను ఘనంగా చేయించి మన  కమ్మర సమస్యలను విపులంగా వివరించి మనకంటూ ఒక భరోసా కల్పించడంలో తన వంతు పాత్రను పోషించారు..అంతేకాదు ప్రక్కన ఉన్న ఎరుకల సంఘ సత్ర నాయకులతో కలసి వారి సత్రానికి మన వారి అందరిని తీసుకు వెళ్లి.. వీరు కమ్మరులు మన st వారే అని వారితో చెప్పించి తన వంతు పాత్రను పోషించడంలో విజయం సాధించారు....అదేవిధంగా ఈరోజు కార్యక్రమం లో ఐకమత్యంగా కలసి వచ్చి ఈ విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.. 
                              ఏ.పి కమ్మర తెగ సంక్షేమ సంఘం