కోవిడ్ పేషెంట్ కు సిజేరియన్..పండంటి బిడ్డకు ఊపిరి!

విమ్స్ ఆస్పత్రిలో డాక్టర్లు గర్భిణి, మరియు covid 19 పేషెంట్ కు విజయవంతంగా సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించారని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 23 సంవత్సరముల గర్భిణీ విమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగిందన్నారు.. ఆమె covid 19 +ve కావడంతో డాక్టర్లు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించగా ఈ రోజు సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు కు పాపకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విమ్స్. డైరెక్టర్ డా.వరప్రసాద్ మరియు సిజేరియన్ నిర్వహించిన డాక్టర్లను అభినందించారు.