పరిపాలన వికేంద్రీకరణకు అర్థం తెలుసా....

పరిపాలన వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే కానీ మూడు రాజధానులు ఏర్పాటు చేయడం కాదని
నుడా మాజీ చైర్మన్ టిడిపి నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. టిడిపి కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి మార్పు సరికాదని ఆ ప్రాంత మహిళల ఉసురు తగులుతుందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో రాయలసీమ ప్రాంతానికి ఒరిగేదేమీ లేదన్నారు. వైసిపి ప్రభుత్వం కరోనా లెక్కలను తారుమారు చేస్తోందని ఆరోపించారు.