జిల్లాలో ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా మరియు బీహార్ రాష్ట్రాలకు సంబంధించి సుమారు నాలుగు వేల మంది వలస కూలీలు ఉన్నారని, వారిని వారి వారి స్వస్థలాలకు చేర్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను
జిల్లా కలెక్టర్ శ్రీ ఎం వి శేషగిరిబాబు ఆదేశించారు. ఆదివారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో వలస కూలీల సంబంధించి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ నుంచి 737, వెస్ట్ బెంగాల్ నుంచి 604 బీహార్ నుంచి 830 మరియు ఒరిస్సా నుంచి 571 మంది వలస కూలీలు ఉన్నారని వారిని వారి స్వస్థలాలకు పంపేటప్పుడు అవసరమైన వైద్య పరీక్షలను రాండమ్ గా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రైల్వే అధికారులతో చర్చించి ఎక్కడినుంచి వారిని రైలు ఎక్కించవలసిన ది తదితర విషయాలను పక్క జిల్లా లతో చర్చించి వారి సమన్వయంతో  వారి వారి గమ్యస్థానాలకు చేర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో అధిక మొత్తంలో వలస కూలీలు ఉన్న వారి ప్రాంతానికి ఇతర   వలస కూలీలు బస్సులలో చేర్చి అక్కడ నుండి పంపే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బస్సులలో సామాజిక దూరం పాటించడంతో పాటు ముందుగానే బస్సులను క్రిమిసంహారకాల తో శుద్ధి చేసి అనంతరము ప్రయాణానికి సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్న వారి వివరాలను క్షుణ్నంగా పరిశీలించి వారు ఏ ఏ కారణాల చేత ఇక్కడికి వచ్చినది, ఏ పని నిమిత్తం ఇక్కడ ఉన్నది తదితర వివరాలను సేకరించాలి అన్నారు. అదేవిధంగా చదువు నిమిత్తం వచ్చిన విద్యార్థులు, ఉన్నత విద్యకై ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన విద్యార్థులు వారి వారి అవసరాలను గుర్తించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. వైద్య పరీక్షలలో ఏదైనను కరోనా లక్షణాలు కనిపించినట్లయితే వారికి నెగిటివ్ రిపోర్టులు వచ్చేవరకు ఇక్కడనే ఉంచి అనంతరం వారిని వారి స్వస్థలాలకు పంపే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కూలీల విషయంలో వారు ఇటుక బట్టి వారా, వ్యవసాయ కూలీల లేదా ఇతర కంపెనీలలో పనిచేస్తున్నావా రా గుర్తించాలన్నారు. ఇతర కంపెనీల్లో పనిచేస్తున్న వారికి వారి వారి వేతనాలను ఇప్పటివరకు చెల్లించిన రా, వారికి సరైన భోజన వసతి ఏర్పాటు చేశారా తదితర విషయాలను పరిశీలించాలన్నారు. వేతనాలకు సంబంధించి ఇంకనూ చెల్లించవలసి ఉన్న కంపెనీలపై లేదా సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత ఆఫీసర్ ను ఆయన ఆదేశించారు. రాష్ట్రాల నుండి, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి సుమారుగా మూడు వేల నుంచి నాలుగు వేల మంది రానున్నారని అట్టి వారి పై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని డివిజనల్ కేంద్రాలలో మరియు జిల్లాల నుంచి వచ్చిన వారిని మండల స్థాయిలో ఉంచి తగిన పరీక్షలు నిర్వహించ వలసిన అవసరం ఉందన్నారు. ధర్మల్ స్క్రీనింగ్ సంబంధించి అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రయాణం ఏర్పాటుకై సంబంధిత శాఖ అధికారులకు త్వరితగతిన సంప్రదించి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ స్టాప్ కోసం ఇతర జిల్లాల వారితో , రైల్వే శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రాండం పరీక్షలు నిర్వహించడం తో పాటు అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించాలని ఆయన అన్నారు. విలేజ్ సెక్రటరియేట్ వ్యవస్థ ద్వారా అవసరమైన సమాచారని త్వరితగతిన రాబట్టుకోవాలని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలకు పంపే వారి విషయంలో జాగరూకత వహించి వీలైనంతవరకూ అందరిని ఒకేసారి పంపేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ మల్లికార్జున, పి డి, డి ఆర్ డి ఎ శీను నాయక్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి  ప్రమోద్ కుమార్ , డి సి ఓ తిరుమలయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జీవ పుత్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.