నెల్లూరు పొగతోటలోని క్లారిటీ స్కానింగ్ సెంటర్ పై ఓ పత్రికలో తప్పుడు కథనాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు స్కానింగ్ సెంటర్ అధినేత డాక్టర్ ఉమా మహేశ్వర రెడ్డి. స్కానింగ్ రేట్లపై పూర్తి వివరాలు తెలుసుకోకుండా వార్తలు రాశారని అన్నారు. స్కానింగ్ సెంటర్ పై వచ్చిన వార్తల్ని ఖండిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారాయన. నెల్లూరు ప్రైవేట్ రేడియాలజీ స్కానింగ్ సెంటర్ అసోసియేషన్ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవాలు తెలుసుకుని రాయాలని సూచించారు.