*నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు, వెంకటాచలం మండలాల్లో పర్యటించి, ఇనుకుర్తి, పూడిపర్తి గ్రామాలలో ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీకి సంబంధించిన లబ్దిని అందించిన ఎమ్మెల్యే కాకాణి.*సర్వేపల్లి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు మహా యజ్ఞంలా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు నెల రోజుల వ్యవధిలోనే మూడు విడతలుగా రేషన్ అందజేయడం జరిగింది.ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత రేషన్ కు అదనంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి బియ్యం, వంట నూనెను పంపిణీ చేశాము.
 ఇప్పటి వరకు సుమారు 300 టన్నుల కూరగాయలు కొనుగోలు చేసి, ప్రజలకు పంపిణీ చేశాము.స్థానికంగా ఉన్న నాయకులు ఎవరికి తోచిన విధంగా వారు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. సర్వేపల్లి నియోజకవర్గం లో ప్రతి కుటుంబానికి అండగా నిలిచి, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా నిత్యం పర్యవేక్షిస్తూ, నిరంతరం శ్రమిస్తున్నాం.