నెల్లూరు జిల్లా వెంకటగిరి...

వెంకటగిరి పట్టణానికి ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లా వెంకటగిరికి అతి దగ్గరలో ఉన్న చిత్తూరు జిల్లా సరిహద్దులలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి మండలాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. శ్రీకాళహస్తి మండలం నుంచి ఎవరినీ లోనికి అనుమతించకుండా అన్ని దారులను మూసేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా, కాళహస్తి మండలంలోని కుర్జాగుంట, మన్నవరం, తదితర గ్రామాల్లోని ప్రజలు ఇష్టారాజ్యంగా ద్విచక్రవాహనాలలో వెంకటగిరి పట్టణంలోకి ప్రవేసిస్తుండగా, వెంకటగిరి సి ఐ అన్వర్ బాషా తన సిబ్బంది తో కలిసి గస్తీ నిర్వహించారు. కాళహస్తి మండలం నుంచి వెంకటగిరి పట్టణం మీదుగా వస్తున్న సుమారు 17 ద్విచక్రవాహనాలను సీజ్ చేసి ఆర్ టి సి గోడౌన్ కి తరలించారు. ఈ దాడుల్లో ఎస్ ఐ రాజేష్, సిబ్బంది, వాలేంటీర్లు పాల్గొన్నారు