నెల్లూరు నగర నియోజకవర్గంలోని 7వ డివిజన్ కు చెందినా కిన్నెర మాల్యాద్రి వారి మిత్రబృందం దాదాపు 200 మంది రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారి సమక్షంలో నెల్లూరు నగరంలోని లక్ష్మీపురం సెంటర్ నందు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు ముక్కాల ద్వారకనాథ్, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, వై.వి.రామిరెడ్డి, పప్పు నారాయణ, తుంగా ఇందూధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.