నారాయణ లో అన్ని రకముల అత్యవసర సేవలు పునఃప్రారంభం..
నారాయణ హాస్పిటల్ కొవిడ్-19 కారణంగా గడచిన 75 రోజులుగా నిలిచిపోయిన ఇన్ పేషెంట్ అత్యవసర చికిత్స లు తిరిగి సోమవారం నుండి  అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 4వ తేదీ నుండి ఇ అవుట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించగా సోమవారం నుండి అన్ని రకముల అత్యవసర వైద్య సేవలు ప్రారంభిస్తున్నాము. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, ఆధునిక వైద్య చికిత్సలు అందించడంలో నారాయణ హాస్పిటల్ ఒక ప్రత్యేకతను చాటుకున్న విషయం విధితమే. నారాయణ వైద్య సేవల కొరకు ప్రతిరోజు వేల సంఖ్యలో రోగుల వద్ద నుండి  మొబైల్ ఫోన్ ద్వారా అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ సేవల కోసం కాల్స్ రావడం నారాయణ హాస్పిటల్ వైద్య సేవలపై వారి యొక్క నమ్మకానికి నిదర్శనం. రోగుల వద్ద నుండి  వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వారు తక్షణం స్పందించి, అవుట్ పేషెంట్ సేవలతో పాటు అన్ని రకముల అత్యవసర సేవలు పున ప్రారంభించేందుకు అవకాశం కల్పించారు. హాస్పిటల్ కి వచ్చేవారు తప్పకుండా తమ వెంట ఆధార్ కార్డు తీసుకొని, మాస్కు ధరించి రావలెను, అంతేకాకుండా హాస్పిటల్ ఔట్ పేషెంట్ , ఇన్ పేషెంట్ విభాగాల వద్ద కోవిడ్ ధర్మల్ స్క్రీనింగ్, శానిటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, ఇది పూర్తిగా ఆరోగ్య భద్రత కోసం అని ప్రజలు గ్రహించాలి. రోగుల భద్రత దృష్ట్యా ఇన్ పేషెంట్ గా చేరినవారికి ఒకరిని మాత్రమే సహాయకులుగా అనుమతించడం జరుగుతుంది. రోగుల సందర్శనార్థం ఎవరిని సందర్శకులు అనుమతించబడదు. ఇతర సలహాలు సంప్రదింపులు కొరకు 9640100555,7331170063. ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు..