కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌లో సోమ‌వారం టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప‌ర్య‌టించారు.  పెద‌పాలపర్రులో ఎన్టీఆర్,ముదినేపల్లి లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నీటి ముంపులోనే వున్న వడ్లకూటితిప్ప,పందిరిపల్లి గూడెం, గుమ్మాలపాడు, శృంగవరపాడు గ్రామాలకు ప‌డ‌వ‌పై చేరుకుని గ్రామ‌స్తుల‌ను ప‌రామ‌ర్శించారు. కొల్లేటివాసుల క‌ష్టాలు చూసి నారా లోకేష్ చ‌లించిపోయారు. త‌మ‌కు క‌నీసం ప్ర‌భుత్వంనుంచి తాగేందుకు మంచి నీరు కూడా అంద‌లేద‌ని బాధితులు లోకేష్ ఎదుట వాపోయారు.