పేర్ని నానిపై హత్యాయత్నం.. మంత్రిపై తాపీతో దాడి చేసిన ఆగంతకుడు.. షాకైన పోలీసు యంత్రాంగం

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం చేశారు దుండగుడు.  మచిలీపట్నంలో ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యకి తాపీతో దాడి చేశాడు. మంత్రి నాని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే నిందితుడిని పట్టుకున్న అనుచరులు..పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ దాడిలో మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయింది.