నల్లపరెడ్డి కుటుంబానికి ఆప్తులు,వైఎస్సార్ కాంగ్రెస్ నేత  సన్నా రెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మృతి చెందడం తీరని లోటు అనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లప రెడ్డి వినోద్ రెడ్డి పేర్కొన్నారు,  చిట్టమూరు మండలం, కృష్ణారెడ్డి కండ్రిగ గ్రామానికి చెందిన చిట్టమూరు మండల  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి సన్నా రెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఇటీవల మృతి చెందారు, సూర్య ప్రకాష్ రెడ్డి అంత్యక్రియలకు నల్లప* రెడ్డి వినోద్ రెడ్డి కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరుకాకపోడంతో సోమవారం వినోద్ రెడ్డి  వైసీపీ నేతలతో కలిసి కృష్ణా రెడ్డి కండ్రిగ గ్రామంలోని శ్రీనివాసులు రెడ్డి స్వగృహానికి చేరుకొని  శ్రీనివాసులు రెడ్డిని అయన కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి తండ్రి సూర్య ప్రకాష్ రెడ్డి నల్లప రెడ్డి కుటుంబానికి ముఖ్య ఆప్తులు అనీ ఆయన తెలిపారు, తన తాతలు నల్లప రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశారు అనీ, చిట్టమూరు మండలం తిరుగులేని నేత గా సూర్య ప్రకాష్ రెడ్డి ఎదిగి గ్రామ సర్పంచిగా, చిట్టమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గా కొనసాగారు ఆయన అన్నారు,