నెల్లూరు/ముత్తుకూరు: ముత్తుకూరు మండలం మల్లూరు లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి శుక్రవారం పర్యటించారు.ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడ్ని రాజకీయాలలో ఇప్పటి వరకు తాను చూడలేదన్నారు. ఇలాంటి వ్యక్తి కల్లబొల్లి మాటలను ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రం యాష్ పాండ్ అవినీతి బాగోతం బట్టబయలు అయిందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి , కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, నడవడి ముత్యం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.