నెల్లూరు మునిసిపల్ కార్మికుల సమ్మె 5వ రోజుకు చేరుకోవడంతో మునిసిపల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నెల్లూరు నగర కమిటీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 130వ జయంతి సందర్బంగా గాంధీబొమ్మ సెంటర్ నుండి వి.ఆర్.సి. సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల పట్ల మునిసిపల్ కమిషనర్ నిరంకుశ వైఖరిని వ్యవహరిస్తున్నారని, పారిశుద్ధ్య కార్మికులను బానిసలలా చూస్తున్నారని కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు వాపోయారు.ఇప్ప్పటికైనా మా గోడు ఆలకించి మాకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు.