నెల్లూరు నగరంలోని మూలపేటలో ఉన్నటువంటి శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ఆలయ పాలకవర్గ చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు.  వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు పి. రూప్ కుమార్ యాదవ్ అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముక్కాల ద్వారకనాథ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వై.వి.రామిరెడ్డి, యేసు నాయుడు,  చాట్ల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. ఆలయ పాలకవర్గ చైర్మన్ గా లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, సభ్యులుగా ఎం.రాజేశ్వరమ్మ, టి.గంగాధర్, పి.మల్లికార్జునరెడ్డి, పి.విష్ణు ప్రియ, కే.బ్రహ్మానందం, కే.గీత, ఎ.పూర్ణచంద్రరావు, ఎస్.వెంకటరమణమ్మ, వి.శివ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.