ఎం.ఎస్.ఆర్ సేవాసమితి వ్యవస్థాపకులు మాగుంట శరత్ చంద్ర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు నగరం లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎం. ఎస్.ఆర్ సేవాసమితి సభ్యులు రక్తదానం,అన్నదానం,వస్త్ర దానం,మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. గౌడ్ హాస్టల్ సెంటర్ నందు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఆర్ సేవాసమితి అధ్యక్షులు సాయి బాబు మాట్లాడుతూ మాగుంట శరత్ చంద్ర రెడ్డి పిలుపు మేరకు మన ఊరు మన బాధ్యత కార్యక్రమం లో బాగంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు, గత ఎనిమిది ఏళ్లు గా నీరు పెద్ద విద్యార్థులకు కళాశాల ఫీజులు చెల్లించడం తో పాటు పలువురు దీర్ఘ కాలిక వ్యాధి గ్రస్తులకు వైద్య సహాయం చేయడం జరుగుతున్నది వేసవి కాలం లో దాహార్తిని తీర్చేందుకు చలి వెంద్రలు ఏర్పాటులు వినూత్న మైన కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది రాజకీయం గా ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ప్రజల తరుపున కోరుచున్నాము ఈ కార్యక్రమం లో మని తేజ రెడ్డి, మహేష్,రాఘవ,నిశాధ్,యశ్వంత్, సాయిరాం,గణేష్,సుమన్ తదితరులు పాల్గొన్నారు.