*💥ఏపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం : చంద్రబాబు* 

💥 *తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది- చంద్రబాబు* 

 *💥ఏపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం : చంద్రబాబు* 


 *వార్త✍️మీజూరు మల్లి✍️:పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రభుత్వం, ఎన్నికల సంఘంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని.. ఎస్‌ఈసీ ఓ రబ్బర్‌ స్టాంప్.. సీఎం ఏం చెబితే అది చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. బాధాకరమే అయినా ఎన్నికల బహిష్కరణ తప్పడం లేదని.. బహిష్కరణ తప్ప మరో మార్గం లేదని చంద్రబాబు అన్నారు.* 

 *టీడీపీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థుల్లో బాధ, ఆవేదన ఉందని.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ప్రజలు ఈ రౌడీ పాలిటిక్స్‌ను అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికలంటే టీడీపీకి కొత్త కాదని.. రౌడీలతో, పోలీసులతో, అవినీతితో పోరాడడం మాత్రమే కొత్తని ఆయన అన్నారు. నచ్చినవారిని ప్రజలు ఎన్నుకునే పరిస్థితి లేకపోవడం దారుణం అన్నారు.*