టాలీవుడ్ ప్రముఖ నిర్మాత శానం నాగ అశోక్ కుమార్ తల్లి శానం చంద్రావతి(90)స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కైకరంలో కన్నుమూశారు. బుధవారం సాయంత్రం ఆమె గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆమెకు నలుగురు సంతానం ఉండగా, రెండో సంతానం నిర్మాత నాగ అశోక్ కుమార్.

అమ్మ ఆశీస్సులతో శ్రీ సాయి దేవ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శుభాకాంక్షలు,వసంతం,ఆడవారి మాటలకు అర్థాలే వేరులే,మాణిక్యం, దొంగ దొంగది,నిన్ను చూశాక,మౌనరాగం, లాంటి ఎన్నో చిత్రాల్ని అశోక్ కుమార్ నిర్మించారు. చంద్రావతి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు