నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కసుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
మోహర్రం పండుగ సందర్బంగా పీర్ల చావిడి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, లబ్ధిదారులకు రైస్ కార్డులు, పెన్షన్ కార్డులు, వికలాంగ ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేసి, నాడు-నేడు కార్యక్రమాలను పరిశీలించి, పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కాకాణి.
త్యాగానికి ప్రతీకైన మోహర్రం పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి మోహర్రం పండుగ శుభాకాంక్షలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15నెల కాలంలోనే  కసుమూరు పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులకు 10 కోట్ల 33 లక్షల నిధులు మంజూరు చేయించి,పనులు చేపట్టడం జరిగింది. ప్రజలకు అవసరమైన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, త్రాగు, సాగు నీరు లాంటి వసతులతో పాటు అధికారులు విధులు నిర్వహించడానికి అవసరమైన  సదుపాయాల కోసం శాశ్వత భవనాలను ఏర్పాటు చేస్తున్నాము.  చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలం పట్టా అందించి తీరుతాం. జల జీవన్ మిషన్ ద్వారా అవసరమైన నిధులను మంజూరు చేయించి, గ్రామాలలో శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసుమూరు దర్గా  సందర్శనకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వసతి సదుపాయాలు కల్పించేందుకు దృష్టి పెడుతున్నాం.  ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న  పథకాల వల్ల ప్రజలు సంతోషం గా ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు త్వరలోనే రేషన్ సరుకులను ఇంటికి చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫీజ్ రీయంబర్సు మెంటు ద్వారా మహానేత రాజశేఖర్ రెడ్డి గారు పేద విద్యార్థులకు విద్యను అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు.  చంద్రబాబు ప్రజలను అన్ని వర్గాలను మోసం చేసినా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు సేవ చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.  గ్రామ నాయకులు అందరూ సమిష్టిగా గ్రామ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. 
నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ నా తోడ్పాటు అందిస్తాను.